: పోచారంలోని ఇన్ఫోసిస్ లో కొండ చిలువ కలకలం
కొండ చిలువ కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం పోచారంలోని ఇన్ఫోసిస్ ఆవరణలోకి కొండచిలువ వచ్చింది. కంపెనీలో ఒక్కసారిగా అది ప్రత్యక్షమవడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే దాన్ని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అయితే స్థానికంగా ఉన్న గుట్టల నుంచే కొండ చిలువ ఐటీ కారిడార్ లోకి వచ్చినట్టు కంపెనీ సిబ్బంది తెలిపారు.