: ఓ వ్యక్తి తన జీవితకాలంలో ఎన్ని సెల్ఫీలు తీసుకోగలడో తెలుసా?
సెల్ఫీల పిచ్చి ముదురుతున్న ప్రస్తుత తరుణంలో లండన్ కు చెందిన 'లస్టర్ ప్రీమియం వైట్' సంస్థ ఓ కొత్తరకం సర్వే నిర్వహించింది. ఓ వ్యక్తి తన జీవితకాలంలో ఎన్ని సెల్ఫీలు తీసుకోగలడు? అంటూ సర్వే చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 1980 తరువాత జన్మించిన వారు వృద్ధాప్యం వచ్చే వరకూ సరాసరిన 25,676 సెల్ఫీలు తీసుకుంటారని సర్వేలో తెలిసింది. 95 శాతం మంది కనీసం ఒక్క సెల్ఫీ అయినా తీసుకున్నారని వెల్లడైంది. సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో ఖాతాలు ఉన్నవారికి సెల్ఫీల సరదా మరింత ఎక్కువ ఉందని వెల్లడించింది. ఇక 63 శాతం మంది విహార యాత్రల్లో సెల్ఫీలు తీసుకుంటారని, అదే అనువైన ప్రదేశమని అభిప్రాయడ్డారు. ఏదైనా వేడుక లేదా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి గడిపిన సందర్భంగానే సెల్ఫీలు తీసుకుంటున్నట్టు చాలా మంది చెప్పారు. ఈ సర్వేలో వెయ్యి మంది అమెరికన్లు కూడా పాల్గొన్నారు.