: టి.మండలి ఉప ఛైర్మన్ గా నేతి విద్యాసాగర్... మాట నిలబెట్టుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ కు తిరిగి శాసనమండలి ఉప ఛైర్మన్ పదవిని కేసీఆర్ అప్పగించారు. ఈ నెల 29న ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విద్యాసాగర్... రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో, గతంలో ఆయనకు ఉన్న ఉప ఛైర్మన్ పదవిని ఆయనకే కట్టబెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.