: వైకాపా సభ్యులపై ఉపముఖ్యమంత్రి మండిపాటు
వైఎస్ఆర్సీపీ సభ్యులపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడిన సంఘటన కర్నూల్ జిల్లా పరిషత్ సమావేశంలో జరిగింది. హంద్రీ నీవా మోటార్లను పట్టిసీమకు తరలించిన అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. హంద్రినీవా మోటార్లను ఎందుకు తరలించారని, ఈ విషయం ఉపముఖ్యమంత్రికి తెలియకుండా ఉంటుందా? అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఉపముఖ్యమంత్రి సహనం కోల్పోయారు. ‘పనిచేయని మోటార్లు ఉంటే ఎంత, లేకపోతే ఎంత?’ అంటూ రుసరుస లాడారు. హంద్రీనీవాకు నీళ్లు కావాలంటే కేవలం నాలుగు రోజుల్లో మోటార్లు తీసుకొస్తామని కేఈ అన్నారు.