: 66 ఏళ్లుగా ఒక్క సెలవూ పెట్టని ఉద్యోగి... రిటైర్ అవుతున్నాడు!


అతని వయసు ఇప్పుడు 78. తన 12వ ఏట ఫొటోగ్రాఫర్ గా మారాడు. అప్పటి నుంచి ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. మరో వారంలో పదవీ విరమణ చేయనున్న ఇతను, యూఎస్ లోని మేరీల్యాండ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం సర్వీస్ చేసిన వ్యక్తిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. హనోవర్ ప్రాంతానికి చెందిన ఇతని పేరు తిమోతీ హైమాన్. ప్రస్తుతం హైవే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. రాష్ట్రంలో జరిగిన రోడ్ల అభివృద్ధి, రవాణా వ్యవస్థలో వచ్చిన మార్పులెన్నింటినో తన కెమెరాతో బంధించిన తిమోతీ, ఎన్నో డాక్యుమెంటరీలకు తన చిత్రాలిచ్చి సహకరించాడు. ఈయన చిత్రాలు మేరీల్యాండ్ రాష్ట్ర చరిత్రను కళ్లకు కడతాయంటే అతిశయోక్తి కాదు. 66 సంవత్సరాల పాటు సెలవు పెట్టకుండా పనిచేసిన తిమోతీ రిటైర్ మెంటును ఘనంగా జరపాలని ఆ రాష్ట్ర గవర్నర్ ల్యాలీ హోగాన్ నిర్ణయించారు. ఆరోగ్యం బాగున్నా, సిక్ లీవులు తీసుకునే ఈ రోజుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోక తప్పదేమో!

  • Loading...

More Telugu News