: నాలుగు పదాలతో ఒకటే నినాదం!: బీహార్ లో బీజేపీ ప్రచారం తీరు


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ తన ప్రచారానికి మరింత పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ పదాల నుపయోగించి ఎక్కువ అర్థం వచ్చేలా, ప్రత్యర్థుల దిమ్మ తిరిగేలా స్లోగన్స్ రూపొందిస్తోంది.‘బదలియే సర్కార్, బదలియే బీహార్’ నాలుగే నాలుగు పదాలతో ఉన్న ఈ స్లోగన్ బీజేపీ వాళ్లదే. ‘ప్రభుత్వాన్ని మార్చండి, బీహార్ ను మార్చండి’ అనేది ఆ స్లోగన్ అర్థం. గత పార్లమెంటు ఎన్నికల్లో ‘పరివర్తన్’ అనే నినాదంతో ప్రచారం చేసిన బీజేపీ ఘన విజయం సాధించింది. అదే బాటలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తోంది. ఈ నినాదాల ద్వారా బీహార్ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళతామనే విషయాన్ని బీజేపీ ప్రచార సభల్లో వివరిస్తోంది. బీహార్ రాజధాని పాట్నా ఇప్పుడు వందలాది బ్యానర్లు, పోస్టర్లతో నిండిపోయింది. ఇక బీహార్ లో అధికార పార్టీ జేడీ(యు) ప్రచార జోరు కూడా బాగానే ఉంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సుపరిపాలన గురించిన బ్యానర్లతో పాటు ఇచ్చిన 'హామీలను నెరవేర్చని మోదీ' అన్న పోస్టర్లు కనిపిస్తున్నాయి. ‘చేసిన తప్పుడు హామీలు చాలు, నితీష్ ప్రభుత్వానికి ఓటు వేద్దాము’ అంటూ జేడీ(యు) ప్రచారాస్త్రాలు సంధిస్తోంది.

  • Loading...

More Telugu News