: ముంబై బాంబు పేలుళ్ల కేసు దోషులకు ఈ నెల 30న శిక్ష ఖరారు


ముంబై లోకల్ ట్రైన్ బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఈ నెల 30న మోకా (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్) కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో మొత్తం 12 మందిని దోషులుగా కొన్ని రోజుల కిందట కోర్టు నిర్ధారించింది. వారిలో ఎనిమిది మందికి మరణశిక్ష విధించాలని, నలుగురికి యావజ్జీవ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ ఈ రోజు కోర్టును కోరింది. 2006 జులై 11న జరిగిన పేలుళ్లలో 188 మంది చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News