: ఎట్టకేలకు సీనియర్లను ఆశ్రయించిన బీజేపీ
నిన్నటి వరకూ పక్కన పెట్టిన ఆ నేతలనే బీజేపీ ఇప్పుడు ఆశ్రయించింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లిన వేళ, బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శత్రుఘ్నసిన్హాలను ఆహ్వానించి, వారిని 'స్టార్ క్యాంపెయినర్' జాబితాలో చేర్చింది. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అద్వానీ, జోషీలను పార్టీ మార్గదర్శక మండలికి మాత్రమే పరిమితం చేసిన బీజేపీ, ఏ ఎన్నికల్లోనూ వారికి ప్రచార బాధ్యతలు అప్పగించని విషయం తెలిసిందే. ఇప్పుడిక వారి అవసరం వచ్చిందేమో, ఎలక్షన్ కమిషన్ కు సమర్పించిన ప్రచారకుల జాబితాలో వీరి పేర్లనూ చేర్చారు. ఇక బీజేపీ సీనియర్లు ఎప్పుడు రంగంలోకి దిగి ప్రజల్లోకి వెళతారో తెలియాల్సి వుంది.