: పుణ్యక్షేత్రాన్ని స్వచ్ఛంగా ఉంచాలంటూ, యువజంటపై బహిరంగ దాడి


పుణ్యక్షేత్రంలో తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఓ హోటల్ లో ఉన్న యువజంటను బయటకు లాక్కొచ్చి నడిరోడ్డుపై దాడి చేసిన ఘటన హరిద్వార్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడి పిరన్ కలియార్ ప్రాంతంలో 50 నుంచి 60 వరకూ గెస్ట్ హౌస్ లు ఉండగా, వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి బసచేస్తుంటారు. కొన్ని గెస్ట్ హౌస్ లలో వివాహం కాని యువతీ యువకులు వచ్చి ఉంటున్నారని, పుణ్యక్షేత్రంలో తమ అవసరాలు తీర్చుకుని వెళుతున్నారని చాలా కాలంగా ఇక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువతి, యువకుడు ఒక గెస్ట్ హౌస్ లో బస చేయగా, 20 మంది యువకులు వారిపై దాడి చేశారు. బహిరంగంగా చావగొట్టారు. వీరిని హింసించిన దృశ్యాలకు సంబంధించి 5 నిమిషాలకు పైగా వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. తమను వెళ్లనివ్వాలని ఎంతగా ప్రాధేయపడ్డా ఆ జంటను వీరు వదల్లేదని తెలిపారు. యువతి జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. దీని ఆధారంగా 20 మందిని గుర్తించి కేసులు పెట్టామని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News