: మ్యాగీ ‘అంతు’ చూసిన అధికారికి ప్రమోషన్


నెస్లే కంపెనీకి చెందిన మ్యాగీలో విషపదార్థాలు ఉన్నాయంటూ దానిపై నిషేధం విధించే వరకు నిద్రపోని అధికారి, ఎఫ్ఎస్ఎస్ఏ సీఈఓ యుథ్ వీర్ సింగ్ మాలిక్ కు ప్రమోషన్ లభించింది. నీతి అయోగ్ లో అడిషినల్ సెక్రటరీగా ఈరోజు బదలీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అపాయింట్ మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసీసీ) మాలిక్ నియామకానికి అనుమతించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయినట్లు పర్సనల్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మాలిక్ బ్యాచ్ మేట్, అదే క్యాడర్ కు చెందిన కేష్నీ ఆనంద్ అరోరా నియామకాన్ని రద్దు చేసి, కొత్తగా సృష్టించిన ఈ పదవిలో మాలిక్ నియామకం జరిగింది. కాగా, హర్యానాకు చెందిన యుథ్ వీర్ 1983 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఎఫ్ఎస్ఎస్ఏఐలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా గత ఏడాది సెప్టెంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News