: రూ. 36,880 ధరతో 95 కి.మీ మైలేజ్ ఇచ్చే బైకు!
లీటరు ఇంధనంతో 95 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చేలా సరికొత్త బైకును భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు టీవీఎస్ ప్రకటించింది. తాము అందిస్తున్న 'స్పోర్ట్' బైకును మరింత మెరుగ్గా తీర్చిదిద్దామని స్టాండర్డ్ డ్రైవింగ్ కండిషన్లలో అత్యుత్తమ మైలేజీని ఇచ్చే దీని ధర కేవలం రూ. 36,880 (ఎక్స్ షోరూం, ఢిల్లీ) అని సంస్థ ప్రెసిడెంట్ కేఎన్ రాధాకృష్ణన్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ స్టార్ట్, అల్యూమినియం గ్రాబ్ రెయిల్, క్రోమ్ మఫ్లర్ తదితరాలు అదనపు ఆకర్షణని వివరించారు. ఎరుపు, నలుపు, తెలుపు, నీలం, బూడిద రంగుల్లో ఇది లభిస్తుందని తెలియజేశారు.