: రోడ్ షోపై కేసుల్లో చిరంజీవికి ఊరట... విచారణలు రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు


ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండగా నమోదైన రెండు కేసుల్లో రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు చిరంజీవికి తాజాగా ఊరట లభించింది. ఈ కేసుల్లో విచారణలను రద్దు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి ఉత్తర్వులు జారీ చేశారు. 2009 ఫిబ్రవరి 19న కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో చిరంజీవి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో వల్ల సాధారణ ప్రజానీకానికి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారన్న ఆరోపణలతో చిరుపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తనపై నమోదైన కేసులో నంద్యాల కోర్టులోని విచారణను, కోయిలకుంట్ల జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణను సైతం కొట్టివేయాలంటూ చిరంజీవి హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జరిగిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కేసుల్లో విచారణలను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News