: సింగపూర్ పర్యటన వివరాలు చంద్రబాబు నాతో పంచుకున్నారు: వెంకయ్య


ఏపీ సీఎం చంద్రబాబు తన సింగపూర్ పర్యటన వివరాలను తనతో పంచుకున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అంతేగాక స్వచ్ఛ భారత్ సమావేశం దృష్ట్యా సీఎం గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శల అభిప్రాయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ రోజు ఢిల్లీలోని తన నివాసంలో చంద్రబాబుకు అల్పాహార విందు అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్మార్ట్ సిటీలుగా ఎంపికైన మూడు నగరాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. విజయవాడ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిందన్నారు. 2019వ సంవత్సరం నాటికి స్వచ్ఛ భారత్ ను నిర్మిస్తామని, ఇందులో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News