: వోక్స్ వ్యాగన్ కుంభకోణం ప్రభావం మాపై లేదు...మార్కెట్ అతిగా స్పందిస్తోందన్న‘మదర్సన్ సుమీ’
వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై భారతీయ కంపెనీ మదర్సన్ సుమీ సిస్టమ్స్ ఘాటుగా స్పందించింది. వోక్స్ వ్యాగన్ కుంభకోణం తమపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోదని ఆ కంపెనీ ప్రకటించింది. భారత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మదర్స్ సుమి వోక్స్ వ్యాగన్ కు విడి భాగాలు సరఫరా చేస్తోంది. తాజా కుంభకోణం వోక్స్ వ్యాగన్ కు తమ సరఫరాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని మదర్సన్ సుమీ సిస్టమ్స్ సీఎఫ్ఓ జీఎస్ గాబా చెప్పారు. అయినా తాము వోక్స్ వ్యాగన్ కు ఇంజిన్ పరికరాలు సరఫరా చేయలేదని కూడా గాబా పేర్కొన్నారు. వోక్స్ వ్యాగన్ కుంభకోణం ప్రభావం తమపై లేశమాత్రం లేకున్నా మార్కెట్ అతిగా స్పందిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ అతిగా స్పందించిన కారణంగానే మదర్సన్ సుమీ షేరు ధర గడచిన రెండు రోజుల్లో 14 శాతం మేర పడిపోయిన సంగతి తెలిసిందే.