: ఎస్పీజీ భద్రత అవసరం లేదు... కేంద్రానికి మన్మోహన్ పుత్రికల వినతి


మన్మోహన్ సింగ్ ప్రధాని పీఠం నుంచి దిగిపోయి ఏడాదిన్నర కావస్తోంది. నిబంధనల మేరకు ఆయనకే కాక ఆయన కుమార్తెలకు కూడా కేంద్రం ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు’(ఎస్పీజీ) భద్రత కల్పిస్తోంది. అయితే ఇకపై తమకు ఎస్పీజీ తరహా భద్రత అవసరం లేదని ఆయన కుమార్తెలిద్దరూ కేంద్ర హోంశాఖకు లేఖలు రాశారు. ఇప్పటికే మన్మోహన్ పెద్ద కుమార్తె, రచయిత్రి దామన్ సింగ్ కు ఎస్పీజీ భద్రత స్థానంలో ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఇక ఢిల్లీ వర్సీటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మన్మోహన్ చిన్న కుమార్తె ఉపిందర్ సింగ్ కూడా ఎస్పీజీ భద్రత అవసరం లేదని కేంద్రానికి లేఖ రాసింది. త్వరలోనే ఆమెకు కూడా ఎస్సీజీ స్థానంలో ఢిల్లీ పోలీసులతో సెక్యూరిటీని ఏర్పాటు చేస్తామని హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

  • Loading...

More Telugu News