: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం... పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న రాత్రికే దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. సింగపూర్ పర్యటనను ముగించుకున్న ఆయన నిన్న నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. స్వచ్చభారత్ పై జరగనున్న నీతి ఆయోగ్ ఉప కమిటీ భేటీకి నేడు చంద్రబాబు హాజరవుతారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో ఆయన వరుస భేటీలు నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి వివిధ అంశాల్లో ఏపీకి అందాల్సిన ఆర్థిక సాయం, సహకారం తదితర అంశాలు ఈ భేటీల్లో చర్చకు రానున్నట్లు సమాచారం. అంతేకాక ఏపీకి ప్రత్యేక హోదా అంశం కూడా ఈ భేటీల్లో కీలక అంశంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.