: రాహుల్ వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు: కాంగ్రెస్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటనకు వెళ్లారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రాహుల్ పర్యటనపై పలువురు నేతలు ప్రశ్నిస్తుండడంతో, ఆయన పర్యటనపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సర్జేవాలా ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లారని, త్వరలోనే ఆయన తిరిగి వస్తారని రణ్ దీప్ తెలిపారు. రాహుల్ లండన్ నుంచి రాగానే బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాహుల్ పర్యటనలపై పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.