: అమ్మాయి ఫోటో చూస్తే చాలు, ఆమె ఎలాంటిదో చెప్పేస్తారట!


అమ్మాయిని చూస్తే చాలు ఆమె ఎలాంటిదో చెప్పేస్తామని చాలా మంది మగాళ్లు చెబుతుంటారు. అయితే, అమ్మాయిని చూడాల్సిన అవసరం లేదు, అమ్మాయి ఫోటో చూపించినా సరే ఆమె ఎలాంటిదో చెప్పేయగల సామర్థ్యం మగాళ్లలో ఉంటుందని పశ్చిమ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అమ్మాయి ఫోటో చూసి ఆమె ఎలాంటిది? నమ్మకస్తురాలా? కాదా? అనే విషయాలు చెప్పగలిగే సామర్థ్యం పురుషుల్లో సహజసిద్ధంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా కొంత మంది పురుషులను తీసుకుని, రెండు భాగాలుగా విభజించారు. వారికి కొందరు అమ్మాయిల ఫోటోలు చూపించారు. రెండు విభాగాల్లోని పురుషులు ఇంచుమించు ఒకేలా స్పందించారు. అంతకు ముందే ఆ అమ్మాయిలు ఎలాంటి వారో తెలుసుకున్న పరిశోధకులు, పురుషులు కూడా అలాంటి సమాధానాలే చెప్పడంతో ఒకింత ఆశ్చర్యపోయి, 'పురుషుల్లో సహజసిద్ధంగా ఆ లక్షణం వచ్చేస్తుంద'ని చివరికి పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.

  • Loading...

More Telugu News