: సీఆర్డీఏ పరిధిని పెంచుతూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధి పెరిగింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 7068.38 చదరపు కిలోమీటర్ల నుంచి 8,352 చదరపు కిలో మీటర్లకు రాజధాని ప్రాంతాన్ని విస్తరిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీయే పాలక మండలిని కూడా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది.