: వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు టీఎస్ ప్రభుత్వం ఒప్పందం
కరెంటు కష్టాలకు చెక్ పెట్టే దిశలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు చత్తీస్ గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల అధికారులు ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం 12 సంవత్సరాల పాటు ఈ డీల్ అమలులో ఉంటుంది. చత్తీస్ గఢ్ నుంచి వార్దా మీదుగా డిచ్ పల్లికి విద్యుత్ లైన్ ను నిర్మించడం ద్వారా విద్యుత్ ను సరఫరా చేసే వీలు కలిగింది. అయితే, ఎప్పటి నుంచి ఈ విద్యుత్ సరఫరా అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.