: లెక్చరర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
కాలేజ్ కు వెళ్తున్న లెక్చరర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని పాలిటెక్నిక్ కాలేజ్ లో జరిగింది. ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న విజయరాజు ఈ ఉదయం కాలేజ్ కు వస్తుండగా... ముసుగులు ధరించిన ఇద్దరు ఆగంతుకులు ఆయనపై దాడి చేశారు. ఇనుప రాడ్లతో కొట్టారు. దీన్ని గమనించిన కొందరు విద్యార్థులు దుండగులను పట్టుకోవడానికి యత్నించారు. ఈ దాడిలో విజయరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.