: జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తెదేపాకు తొలి విజయం


జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తరువాత తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్ లో జరిగిన నగర పాలక ఎన్నికల్లో రెండు వార్డుల్లో విజయం సాధించి, మరో 16 వార్డుల్లో రెండవ స్థానంలో నిలిచింది. మొత్తం 24 వార్డులకు ఎన్నికలు జరుగగా, అన్నింటా ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడ్డాయి. 10 వార్డుల్లో గెలిచిన బీజేపీ అగ్రస్థానంలో నిలువగా, కాంగ్రెస్ 6, తెలుగుదేశం 2, అన్నాడీఎంకే 1, డీఎంకే 1, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటడం పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ హోదాలో తెలుగుదేశానికి దక్కిన తొలి విజయం ఇదని ఆయన అన్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ తరఫున పోర్టు బ్లెయిర్ లో చినరాజప్ప ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నేతృత్వంలో త్వరలోనే మరిన్ని ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరిస్తుందని ఆయన అన్నారు. బీజేపీ 10 స్థానాల్లో గెలువగా, తెలుగుదేశం పార్టీకి ఇద్దరు సభ్యులు ఉండటంతో, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు సాయంతో నగర పాలక పీఠం కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

  • Loading...

More Telugu News