: భారతీయ జీవన విధానంతో పర్యావరణంలో మార్పులకు చెక్: మంత్రి జవదేకర్


పర్యావరణంలో సంభవిస్తున్న దారుణమైన మార్పులకు చెక్ పెట్టి, ప్రపంచాన్ని కాపాడగలిగేది భారతీయ జీవన విధానం మాత్రమేనని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. పశ్చిమదేశాలతో పోలిస్తే అనవసరమైన అలవాట్లు మనదేశంలో లేవని అన్నారు. కార్బన్ ఉద్గారాల విడుదలలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్, గ్లోబల్ వార్మింగ్ పై ఐక్యరాజ్యసమితి (యూఎన్)తో చర్చలకు సన్నద్ధమవుతోందన్నారు. అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ లో కార్బన్ ఉద్గారాల తలసరి శాతం తక్కువగానే ఉందన్నారు. అందుకే భారతీయ జీవనశైలికి కృతఙ్ఞతలు చెప్పుకోవాలన్నారు. ప్రపంచ దేశాలు తమ జీవన విధానాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే, ఆయా జీవన విధానాలలో ఉన్న అనవసర అలవాట్లను భరించే శక్తి భూమండలానికి లేదన్నారు. జీవన విధానం అనేది పేదరికం నుంచి వచ్చేది కాదని, విలువల ద్వారా పెంపొందించుకునేదని జవదేకర్ అన్నారు.

  • Loading...

More Telugu News