: పోర్టు బ్లెయిర్ లో సత్తా చాటిన తెలుగుదేశం
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్ స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. పోర్టు బ్లెయిర్ నగరపాలక సంస్థ ఎన్నికల తరువాత ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఇప్పటి వరకూ 12 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. 5, 6 వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 1, ఏఐఏడీఎంకే 1, డీఎంకే 1, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. మరో 12 వార్డుల ఫలితాలు వెలువడాల్సి వుండగా, తెలుగుదేశంతో కలిసి బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని తెలుస్తోంది. ఈ రెండు పార్టీల కూటమికి సాధారణ మెజారిటీ దక్కాలంటే, మరో 5 వార్డుల్లో బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించాల్సి వుంది.