: ఇక యాపిల్ ఎలక్ట్రిక్ కారు... 2019లో రోడ్డెక్కుతుందట!
స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ‘యాపిల్’ తన ఉత్పత్తుల పరిధిని మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఐఫోన్ తో ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో మెజారిటీ వాటా చేజిక్కించుకున్న యాపిల్ అంతకుముందు ఐపాడ్ లతోనూ టెక్నాలజీ ప్రియులను ఆకట్టుకుంది. తాజాగా సరికొత్త ఉత్పత్తుల దిశగా పరిశోధనలు చేస్తున్న యాపిల్, ఎలక్ట్రిక్ కారును రూపొందించే పనిలో నిమగ్నమైందట. ప్రస్తుతం 600 మందితో కూడిన ఆ కంపెని నిపుణుల బృందం ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. ఈ మేరకు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ నిన్నటి తన సంచికలో ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ‘టైటాన్’ పేరిట రూపొందనున్న యాపిల్ ఎలక్ట్రిక్ కారు 2019లో రోడ్డెక్కనున్నట్లు ఆ పత్రిక తెలిపింది.