: బ్రాడ్ బ్యాండ్ వ్యాప్తిలో తగ్గిన భారత్ ర్యాంక్... వ్యక్తిగత ఇంటర్నెట్ వినియోగంలో పెరిగింది


బ్రాడ్ బ్యాండ్ వ్యాప్తి, వ్యక్తిగత ఇంటర్నెట్ వినియోగంలో భారత్ కు భిన్న ఫలితాలు వచ్చాయి. 'ది స్టేట్ ఆఫ్ బ్రాడ్ బ్యాండ్' పేరుతో ఐక్యరాజ్య సమితి బ్రాడ్ బ్యాండ్ కమీషన్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇంటర్నెట్ అందించే ఆర్థిక, సామాజిక లబ్ధిని అందిపుచ్చుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 57 శాతం మంది దూరంగానే ఉన్నారని నివేదిక తెలిపింది. మొత్తం 189 దేశాలు ఈ జాబితాలో ఉండగా, భారత్ 2014లో 131వ స్థానంలో ఉండగా, అంతకుముందు ఏడాది 126వ స్థానంలో నిలిచింది. ఇక వ్యక్తిగతంగా ఇంటర్నెట్ వినియోగించే వారి కేటగిరీలో 142వ స్థానం నుంచి 136వ స్థానానికి భారత్ చేరింది. ఈ నెల 26న 'సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్' సదస్సుతో పాటు 'బ్రాడ్ బ్యాండ్ కమీషన్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్' సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఐరాస పై నివేదికను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News