: జగన్ సభలో తొక్కిసలాట
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని పోర్టు స్టేడియంలో వైకాపా ఆధ్వర్యంలో యువభేరి సభ జరుగుతోంది. వైకాపా అధినేత జగన్ ఈ సభలో ప్రసంగిస్తున్నారు. ఈ సభకు విద్యార్థులను భారీగానే తరలించారు నిర్వాహకులు. అయితే, విద్యార్థులను తరలించడంపై చూపిన ఆసక్తిని, వారి మంచి చెడ్డలపై మాత్రం నిర్వాహకులు చూపలేదు. దీంతో, అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎన్నారై కళాశాలకు చెందిన విద్యార్థులు ఒక్కసారిగా తోసుకురావడంతో, ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ఓ విద్యార్థి గాయాలపాలయ్యాడు. దీంతో, తోటి విద్యార్థులు అతడిని అక్కడి నుంచి తరలించారు. విద్యార్థుల భద్రతపై వైకాపా నేతలు దృష్టి సారించకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.