: ఆలస్యంగా వచ్చిన విద్యార్థులపై టీచర్ ప్రతాపం


విద్యార్థులు ఆలస్యంగా వచ్చారంటూ వారిపై ఓ టీచర్ తన ప్రతాపం చూపిన సంఘటన హైదరాబాద్, మీర్ పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. నలుగురు విద్యార్థులను ఆ టీచర్ చితకబాదడంతో ఒక విద్యార్థి చేయి విరిగింది. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో మండిపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై స్పందించిన డీఈవో తక్షణ విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News