: రాహుల్ గాంధీకి అంగుళం అంటే ఏమిటో తెలుసా?: వెంకయ్యనాయుడు
భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. అంగుళం భూమి కూడా సేకరించకుండా రాహుల్ అడ్డుకుంటామంటున్నారు, అసలు ఆయనకు అంగుళం అంటే ఏమిటో తెలుసా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో సేకరించిన భూముల వివరాలను బయటపెడతామన్న వెంకయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షల ఎకరాల భూమిని సేకరించారని చెప్పారు. 'పరిపాలనలో మార్పులు' అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన సదస్సును వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి నుంచి తమకు కితాబులు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే మోదీకి మంచి రేటింగ్ ఇస్తున్నారని చెప్పారు.