: రెండు గంటలుగా నిలిచిపోయిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్


ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తడటంతో కాచిగూడ-అకోలా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు రెండు గంటల పాటు నిలిచిపోయింది. తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వేస్టేషన్ లో ఈ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచి పోయినట్లు సమాచారం. మరో రైలు ఇంజన్ ఏర్పాటు చేసే పనుల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తలమునకలై ఉన్నారు. ఈ ఎక్స్ ప్రెస్ రైలు ప్రతిరోజూ కాచిగూడలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి నిజామాబాద్ మీదుగా అకోలా చేరుకుంటుందని అధికారులు చెప్పారు. ఇంటర్ సిటీ నిలిచిపోవడంతో గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

  • Loading...

More Telugu News