: 'శ్రీమంతుడు'గా మిగలాలంటే అమీర్ పేట బస్తీలకు వెళ్లండి: సెలబ్రిటీలపై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు


పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి మధ్య ఉన్న గ్రామాల్లోని ప్రజల కన్నా, అమీర్ పేట వెనకున్న బస్తీల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్న ప్రజలెందరో ఉన్నారని, సెలబ్రిటీలు వాటిని దత్తత తీసుకోగలరా? అని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించాడు. గ్రామాలను దత్తత తీసుకుంటున్న సినీ తారలను టార్గెట్ చేస్తూ, కామెంట్లు వదిలాడు. గ్రామాలను దత్తత తీసుకోవడం అంటే, గ్రామీణులను అవమానించడమేనని, ఎవరైనా హాలీవుడ్ నటుడు వచ్చి, ఇండియా వెనుకబడిన దేశం అని చెబుతూ, దత్తత తీసుకుంటానంటే ఎలా వుంటుంది? అని ప్రశ్నించాడు. గ్రామస్థులు ఆత్మాభిమానులని, వారు ఈ చర్యలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దత్తత వల్ల రాజరిక వ్యవస్థ వచ్చే ప్రమాదం వుందని, ఆయా గ్రామాలకు వాళ్లు తమకు తామే మహారాజులుగా భావిస్తారని అన్నారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేంత మంచి హృదయం మన నటీ నటులకు ఉందని తాను అనుకోవడం లేదని ఘాటైన విమర్శలు చేశాడు.

  • Loading...

More Telugu News