: డైనింగ్ టేబుల్ పైనుంచి వాటిని తీసేయండి, లేకపోతే... లావైపోతారు!
డైనింగ్ టేబుల్ మీద పెద్దపెద్ద భోజన పాత్రలున్నాయా? అయితే వాటిని తక్షణం తీసేయండి. లేదా మీరు లావైపోతారని పరిశోధకులు సూచిస్తున్నారు. పెద్ద పాత్రలు ఉంటే తినాల్సిన దానికంటే ఎక్కువే లాగిస్తారని వారు సూచిస్తున్నారు. 6,711 మందిపై పరిశోధనలు చేసిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు పాత్రల పరిమాణం కారణంగా తినాల్సిన దాని కంటే ఎక్కువ తింటున్నారని పేర్కొన్నారు. భోజనం చేస్తున్న పాత్రల పరిమాణం మార్చడం కారణంగా బ్రిటన్ లో 16 శాతం, అమెరికాలో 20 శాతం మందిని ఊబకాయం బారిన పడకుండా కాపాడవచ్చని వారు వెల్లడించారు. పెద్ద పాత్రల్లో భోజనం చేయడం, అదే సమయంలో తీపి పానీయాలు (సాఫ్ట్ డ్రింక్స్) తాగడం వల్లే ఊబకాయం బారినపడుతున్నారని, తద్వారా గుండెజబ్బులు, మధుమేహం వచ్చి పడుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. దీంతో ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే తక్షణం భోజనం చేసే పాత్రల పరిమాణం తగ్గించాలని వారు స్పష్టం చేశారు.