: ముద్దు మాటలతో నెట్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఆరేళ్ల బాలిక


ముద్దు ముద్దు మాటలతో తల్లి కళ్లు తెరిపించిన చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది. కెనడాలోని సర్రే నగరానికి చెందిన చెరిష్ షెర్రీ అనే మహిళ భర్త నుంచి విడిపోయింది. వారిద్దరూ మళ్లీ కలిసే విషయంలో వాగ్వాదం నడుస్తుండగా, వారి కుమార్తె ఆరేళ్ల టియానా షెర్రీ, తల్లిని ప్రత్యేకంగా తీసుకువెళ్లి "డాడీతో స్నేహంగా నవ్వుతూ ఉండలేవా?" అని ప్రశ్నించింది. డాడీతో పెద్ద గొంతుతో మాట్లాడవద్దని, నెమ్మదిగా మాట్లాడాలని సూచించింది. "డాడీ, నువ్వు విడిపోవడం ... ఆ స్థానాల్లోకి ఇంకెవరో రావడం, ఇదంతా వద్దు... మనం సంతోషంగా ఉండాలి, నేను బాగుంటే మనం అంతా బాగుంటాం కదా? అందరం కలిసి, ఫ్రెండ్లీగా ఉండాలి, నవ్వుతూ సంతోషంగా ఉండాలి" అంటూ మూడు నిమిషాల పాటు చిన్నపాటి ఉపన్యాసం దంచింది. దీంతో తల్లి చిన్నారికి ఓ ముద్దు పెట్టి 'అలాగే' అని చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెడితే ఆరు మిలియన్ల మంది దీనిని వీక్షించారు.

  • Loading...

More Telugu News