: అందుకే దుగరాజపట్నం పోర్టు పూర్తి కావడం లేదు: చింతా మోహన్
దుగరాజపట్నం పోర్టు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం, ఓ ప్రైవేటు పోర్టు నిర్మాణ సంస్థ అడ్డుకుంటున్నాయని అన్నారు. లక్ష ఉద్యోగావకాశాలు ఉన్న దుగరాజపట్నం పోర్టు నిర్మాణం తక్షణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్న ప్రైవేటు పోర్టు నిర్మాణ సంస్థే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు హెలికాప్టర్, విమానం ఏర్పాట్లు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని ఆయన గుర్తు చేశారు.