: ప్రధాని రాజీనామా చేసే ప్రసక్తేలేదు : సోనియాగాంధీ


బొగ్గు కుంభకోణం వ్యవహారంలో ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండును కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తోసిపుచ్చారు. రాజీనామా చేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. 2014 వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలోనే ఉంటుందని చెప్పారు. అంతకుముందు సోనియాతో సమావేశమైన ప్రధాని.. పార్లమెంటులో విపక్షాలు 2జీ, బొగ్గు కుంభకోణం, పలు అంశాలపై చర్చకు డిమాండు చేసిన సమయంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మరోవైపు విపక్షాలు చేస్తున్న ఆందోళన తీవ్రతరం కావడంతో లోక్ సభ ఈ నెల 25కి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News