: ఏపీ, తెలంగాణలో ఇసుక మాఫియాపై హైకోర్టు ఆగ్రహం


ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇసుక మాఫియాపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక మాఫియాను అడ్డుకునే విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని మండిపడింది. ఇసుక తవ్వకాలపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇసుక రీచ్ ల కేటాయింపు కేసులో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్, ఏపీ ప్రభుత్వ న్యాయవాదిపై కోర్టు తీవ్రంగా మండిపడింది. కోర్టులో ఉండి కూడా అడ్వకేట్ జనరల్ కు సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరణతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. అటు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలలో ఇసుక మాఫియాపై విచారించిన కోర్టు, కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. సీజ్ చేసిన వాహనాలను స్థానిక కోర్టుల అనుమతితో తీసుకెళ్లకుండా నిబంధనలు మరింత కఠినతరం చేయాలని తెలిపింది. ఇసుక మాఫియా వెనుక ఎవరెవరు ఉన్నారో స్పష్టం చేయాలని ఎస్పీని ఆదేశించింది. కాగా ఇప్పటివరకు 54 కేసులు నమోదు చేశామని కరీంనగర్ ఎస్పీ న్యాయస్థానానికి తెలిపారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News