: నా కుక్కను చంపిపెడతారా?: టెక్సాస్ మహిళ ఫేస్ బుక్ పోస్ట్


‘ఫేస్ బుక్ మిత్రులారా, నా కుక్కను చంపిపెట్టండి. కావాలంటే తుపాకీ కూడా ఇస్తాను. ఎందుకంటే, చాలా ప్రేమగా పెంచుకుంటున్న నా పెట్ కు ఎక్కువ కాలం నేను సేవలందించలేను. దాని బాధ్యతను స్వీకరించలేను. నా పెట్ ను చంపేందుకు మా దేశంలో ఎవ్వరికీ హృదయం లేదు. అందుకే..ఫేస్ బుక్ ద్వారా కోరుకుంటున్నాను. నా మనవి ఆలకించండి’ అంటూ ఫేస్ బుక్ లో తన పెట్ ఫొటోను టెక్సాస్ కు చెందిన ఒక మహిళ పోస్ట్ చేసినట్లు కేహెచ్ఓయు.కామ్ పేర్కొంది. సెయింట్ బెర్నార్డ్, ఇంగ్లీషు బుల్ డాగ్ జాతుల మిశ్రమానికి చెందిన ఈ మూడు సంవత్సరాల వయస్సున్న శునకం పేరు సిన్నమన్. ఇదిలా ఉండగా, ఈ శునకాన్ని యానిమల్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీని బాధ్యతలను ఒక కుటుంబం వారు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News