: ప్రత్యేక హోదాను పక్కన పెట్టి, తన హోదాను పెంచుకోవాలనుకుంటున్నారు: చంద్రబాబుపై బొత్స ఫైర్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తే, భవిష్యత్తు బాగుంటుందన్న ఆకాంక్ష ప్రజలందరిలో ఉందని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదాను పక్కనబెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తన వ్యక్తిగత హోదాను పెంచుకునే పనిలో పడ్డారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఏపీ ప్రజలను టీడీపీ, బీజేపీలు కలసి మోసం చేశాయని ఆరోపించారు. స్పెషల్ స్టేటస్ గురించి ఢిల్లీలో చంద్రబాబు ఏమీ మాట్లాడటం లేదని అన్నారు. వైకాపా అధినేత జగన్ ఒత్తిడితోనే అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై తీర్మానం చేశారని చెప్పారు.