: ఢిల్లీలో తల్లి, ఇద్దరు పిల్లలు హత్య!
ఢిల్లీలోని ఒక ఇంట్లో తల్లీపిల్లల మృతదేహాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఎవరో దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... వెస్ట్ ఢిల్లీలోని రఘబీర్ నగర్ లో ఉన్న ఒక అపార్టుమెంట్ లో జాఫర్ కుటుంబం రెండో అంతస్తులో నివసిస్తోంది. ఈ రోజు ఉదయం జాఫర్ ఇంట్లోకి అడుగుపెట్టగానే తన భార్య షబ్నమ్(28), ఇద్దరు పిల్లలు ఇమ్రాన్(7), ఖుషీ(6) మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించాడు. షబ్నమ్ ముఖంపై, మెడపై గాయాలు ఉన్నాయి. దీంతో జాఫర్ పోలీసులకు సమాచారమందించాడు. కాగా, పనుల నిమిత్తం రెండు రోజుల క్రితం జాఫర్ జైపూర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.