: ఇంజినీరింగ్ విద్యార్థులు దాడి చేశారంటూ... పదోతరగతి విద్యార్థి ఫిర్యాదు
పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గూంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠికి ఫిర్యాదు చేశాడు. తనపై కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు దాడి చేశారని, దాంతో తన కంటికి గాయమైందని నగరంలోని శ్యామలానగర్ పాఠశాలకు చెందిన ఈ కుర్రాడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. విద్యార్థి ఫిర్యాదుకు వెంటనే స్పందించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు.