: యూపీలో భారీ బదిలీలు... 65 మంది ఉన్నతాధికారులకు స్థాన చలనం!


అప్పుడెప్పుడో మాయావతి సీఎంగా ఉన్న సమయంలో ఉత్తర ప్రదేశ్ లో భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగిపోయేవి. దేశంలోనే పెద్ద రాష్ట్రమైనప్పటికీ, ఒకేసారి 60, 70 మంది ఉన్నతాధికారులను బదిలీ చేయడం మాయావతి సర్కారుకు అలవాటే. తాజాగా ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా మాయావతి బాటలోనే పయనిస్తున్నారు. ఇప్పటికే పాలనలో పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్న అఖిలేశ్ యాదవ్ నేటి ఉదయం రాష్ట్రంలోని 23 మంది ఐఏఎస్, 42 మంది ఐపీఎస్ అధికారులను సింగిల్ జీవోతో బదిలీ చేసి పారేశారు. బదిలీ అయిన వారిలో జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు, ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో కొనసాగుతున్న పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నారు.

  • Loading...

More Telugu News