: తెరపై నా పాత్ర అమీర్ చేస్తేనే బాగుంటుంది: విశ్వనాథన్ ఆనంద్


బాలీవుడ్ లో క్రీడా నేపథ్యంతో వరుస సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భవిష్యత్తులో చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ జీవితచరిత్ర ఆధారంగా కూడా చిత్రం రూపొందే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ తన జీవితచరిత్రను సినిమాగా తీస్తే తన పాత్రను బాలీవుడ్ నటుడు అమీర్ ఖానే చేయాలని ఆనంద్ అంటున్నారు. ఆయన చేస్తేనే తన పాత్ర బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కారణం అడిగితే, అమీర్ చెస్ బాగా ఆడతారని, పాత్రలో ఆయనే సహజంగా ఒదిగిపోతారని ముంబైలో జరిగిన ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ఇదిలాఉంటే అమీర్ ప్రస్తుతం రెజ్లింగ్ క్రీడపై తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. చందరంగంపై కూడా ఓ సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్టు ఆ మధ్య ప్రకటించారు.

  • Loading...

More Telugu News