: గర్భనిరోధక మాత్రలకు దూరంగా ఉంటేనే మంచిది: పరిశోధకులు


మహిళలు సాధ్యమైనంత వరకు గర్భనిరోధక మాత్రలకు దూరంగా ఉంటేనే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. అమెరికాలోని లయోలా యూనివర్శిటీ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. గర్భనిరోధక మాత్రలతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తమ అధ్యయనంలో తేలినట్లు చెప్పారు. అయితే, గుండె సంబంధిత వ్యాధులు లేని మహిళల్లో గుండెపోటు ముప్పు శాతం తక్కువగానే ఉంటుందన్నారు. గుండెసంబంధిత వ్యాధులతో బాధపడే వారిపై మాత్రం దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ప్రతి లక్ష మంది మహిళల్లో కాంట్రాసెప్టివ్ మాత్రల వల్ల గుండెపోటు వస్తోందన్నారు. ధూమపానం, హై బీపీ, మైగ్రెయిన్ ఉన్న మహిళలు గర్భనిరోధక మాత్రల జోలికి వెళితే వాటి ప్రభావం మరింత ప్రమాదకరంగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News