: హార్దిక్ కు షాకిచ్చిన ఆరెస్సెస్ చీఫ్... రిజర్వేషన్లపై పునరాలోచన చేయాలని వ్యాఖ్య


పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరు సాగిస్తున్న గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ భారీ షాకిచ్చారు. ఓ వైపు రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ దేశవ్యాప్తంగా ఉన్న తన సామాజిక వర్గాన్ని కూడగట్టే పనిలో బిజీబిజీగా ఉన్నారు. హార్దిక్ దూకుడును తగ్గించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపిన మోహన్ భగవత్... అసలు దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లపైనే పునరాలోచన చేయాలని వ్యాఖ్యానించారు. తద్వారా అసలు రిజర్వేషన్లనే ఎత్తివేయాలని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారన్న వాదనా వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News