: ‘యాదవ్’ నామస్మరణలో బీజేపీ... బీహార్ అభ్యర్థుల లిస్టులో 24 మందికి పైగా యాదవులే!


ఉత్తర భారతంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లలో యాదవులు బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. ప్రధానంగా రాజకీయ రంగంలో ఆ సామాజిక వర్గానిదే నిర్ణయాధికారం. ఈ విషయం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. ప్రస్తుతం ఎన్నికలకు రంగం సిద్ధమైన బీహార్ లో అధికారమే పరమావధిగా ప్రధాని నరేంద్ర మోదీ పక్కా ప్రణాళిక రచించారు. ఇప్పటికే ఆ రాష్ట్రానికి అడగకున్నా రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. అయినా యాదవులు లేకుండా విజయం సాధించడం అసాధ్యమన్న విషయాన్ని కూడా ఆయన గుర్తించినట్లుంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన లాలూ ప్రసాద్ కూటమికి చెక్ పెట్టేందుకు కమలనాథులు కూడా యాదవులను బరిలోకి దించుతుండటమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా 153 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, వాటిలో 24 స్థానాలకు పైగా యాదవులకు కట్టబెట్టింది. ప్రతి జిల్లాలో కనీసం ఒక్క యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధి అయినా ఉండే విధంగా ఆ పార్టీ వ్యూహ రచన చేసింది. మరి ఈ మంత్రమైనా కమలనాథులను గట్టెక్కిస్తుందో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News