: నిన్నటి వరకు భాయ్...ఇకపై 'డాక్టర్' లక్ష్మణ్: హర్భజన్ సింగ్


ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు గీతం యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందజేసింది. ఈ సందర్భంగా తనకు డాక్టరేట్ ఇచ్చిన గీతం యూనివర్సిటీకి లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, టీమిండియాలో నెమ్మదస్తుడు, మంచి వ్యక్తిగా పేరొందిన లక్ష్మణ్ ను గౌరవ డాక్టరేట్ తో సత్కరించడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు అద్భుతమైన వ్యక్తిగా, సోదరుడిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ ఇక నుంచి 'డాక్టర్ లక్ష్మణ్' అవుతాడని హర్భజన్ సింగ్ సరదాగా కామెంట్ చేశాడు. అలాగే 'డాక్టర్ సాబ్' అంటూ శిఖర్ ధావన్ శుభాకాంక్షలు తెలిపాడు.

  • Loading...

More Telugu News