: సింగపూర్ చేరిన ఏపీ సీఎం... ప్రతినిధులతో చర్చలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఆ వెంటనే ఆయన విశ్రాంతి తీసుకోకుండా సింగపూర్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, పెట్టుబడులపై చంద్రబాబుతో వారు చర్చిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సేవలందించే ప్రతి ఒక్కరితో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని బాబు చెప్పారు. సింగపూర్ ప్రధానిని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడం, పెట్టుబడిదారులతో చర్చలు లక్ష్యంగా రెండు రోజుల సింగపూర్ పర్యటనకు ముఖ్యమంత్రి వెళ్లిన సంగతి తెలిసిందే.