: ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో 10 కేజీల బంగారం
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పది కేజీల బంగారం పట్టుబడింది. మూడు వేర్వేరు విమానాల్లో ఈ బంగారం స్మగ్లింగ్ అయిందని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ లాయర్ నుంచి 2.6 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ ఎయిర్ వేస్ విమానంలోని టాయిలెట్ నుంచి కస్టమ్స్ అధికారులు నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో విమానంలో కూడా మూడున్నర కేజీల బంగారం దొరికినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో నేడు పది కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.