: కేసీఆర్ ను కలిసిన కేరళ సీఎం చాందీ
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇక్కడి జూబ్లీహిల్స్ లో కేరళ భవన్ నిర్మించనున్నారు. దీనికి ఈరోజు శంకుస్థాపన జరగనుంది. ఈ నేపథ్యంలోనే చాందీ హైదరాబాద్ రావడం జరిగింది. కేరళ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్ కూడా పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు సమాచారం.