: వచ్చే నెలలో నేతాజీ వారసులతో సమావేశం: ప్రధాని మోదీ


‘స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులతో వచ్చే నెలలో సమావేశం ఉంటుంది. నా నివాసంలోనే ఆ సమావేశం జరగనుంది. గత మేలో కోల్ కతా వెళ్లాను. అప్పుడు సుభాష్ బాబూ (నేతాజీ) కుటుంబసభ్యులను కొందరిని కలిశాను. నేతాజీకి సంబంధించి అందుబాటులో ఉన్న ఆయన వారసులందరినీ కలుసుకోవాలనిపించింది. సుమారు 50 మందికి పైగా బోస్ వారసులు ఈ సమావేశంలో పాల్గొంటారు’ అని మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ భేటీలో బోస్ కుటుంబీకులతో పాటు స్కాలర్లు, తదితరులు కూడా పాల్గొంటారని సమాచారం.

  • Loading...

More Telugu News